సిద్ధిపేటవాసుల రైల్వే కల సాకారం.. ట్రయల్ రన్ సక్సెస్
X
సిద్దిపేటవాసుల రైల్వే కల సాకారమైంది. సిద్దిపేట రైల్వేస్టేషన్‌లో త్వరలోనే రైలు పరుగులు పెట్టనుంది. గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్ పూర్తికాగా.. శుక్రవారం ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్గా పూర్తైంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ప్యాసింజర్ రైలు సిద్దిపేట రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఈ ట్రయల్ రన్‌ను అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. ట్రాక్ వెంట తిరుగుతూ అన్నీ కుణ్ణంగా పరిశీలించారు. సిద్దిపేటకు త్వరలోనే పూర్తిస్థాయిలో రైల్వే సర్వీసులు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు కొత్త రైల్వేలైన్ ప్రాజెక్టు చాలా ఏండ్లుగా పెండింగ్‌లో ఉంది. సమైక్య రాష్ట్రంలో ఈ రైల్వే లైన్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఈ రైల్వే లైన్ పనులు వేగవంతమయ్యాయి. ఇప్పటికే మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు రైల్వేలైన్ నిర్మాణం పూర్తై గూడ్స్ రైళ్లు తిరుగుతున్నాయి.