Home > తెలంగాణ > రేవంత్ రెడ్డి కాన్వాయ్ల్లో భద్రతా లోపం? సీఎం వెహికల్స్ ఇలానా ఉండేది?

రేవంత్ రెడ్డి కాన్వాయ్ల్లో భద్రతా లోపం? సీఎం వెహికల్స్ ఇలానా ఉండేది?

రేవంత్ రెడ్డి కాన్వాయ్ల్లో భద్రతా లోపం? సీఎం వెహికల్స్ ఇలానా ఉండేది?
X

ముఖ్యమంత్రి కాన్వాయ్ అంటే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య.. భారీ సెక్యూరిటీతో ఉంటుంది. సీఎం వెళ్తుంటే కార్లన్నీ జంబ్లింగ్ అవుతూ.. ఆయన ఏ కారులో ఉన్నారో కనిపెట్టడానికి వీలులేకుండా చేస్తారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ చూసినంతనే లోపాలు కళ్ల ముందు కనిపించడం ఉండటం విస్మయానికి గురి చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయటం.. ఆయన ప్రయాణించే కాన్వాయ్ లను కొంగొత్తగా సిద్ధం చేసిన విషయం తెలిసిందే. అయితే.. సీఎం కాన్వాయ్ లోని లోపాలపై ఆసక్తికర చర్చ జరగటమే కాదు.. ఈ మాత్రం జాగ్రత్తల్ని పోలీసుశాఖ ఎందుకు తీసుకోవటం లేదు? అన్నది ప్రస్తుతం చర్చగా మారింది.

పలు భద్రత కారణాల దృష్ట్యా.. సీఎం కాన్వాయికి ఒకే నంబర్, ఒకే రంగు ఉంటుంది. రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఆయన కాన్వాయ్ లకు TS 07 FF 0009 నంబర్ ను కేటాయించారు. అయితే మిగిలిన కార్లకు TS 09 RR 0009 నంబర్లు ఉన్నాయి. ఇక సీఎం కారు నలుపు రంగులో ఉండగా, మిగతావి తెల్ల రంగుల్లో ఉన్నాయి. ఇక్కడే భద్రతలోపం కనిపిస్తుంది. దీంతో ఆయన ఏ కారులో ఉన్నారో ఇతరులకు స్పష్టంగా తెలుస్తోంది. ఇది భద్రతాలోపాన్ని సూచిస్తుండగా మార్పులు చేయాల్సి ఉంది.

అయితే రేవంత్ రెడ్డికి నలుపు రంగు అంటే ఇష్టమట. మాజీ సీఎం కేసీఆర్ తెలుపు రంగును ఇష్టపడేవారు. ప్రస్తుతం ఉన్న సీఎం కాన్వాయ్ ల్లో కేసీఆర్ హయాంలో ఉన్న తెలుపు కార్లే కొనసాగుతున్నాయి. ఒక్క రేవంత్ రెడ్డి కాన్వాయ్ మాత్రం ఆయనకు ఇష్టమైన నలుపు రంగును ఏర్పాటుచేశారు. కాగా దీనిపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. మిగిలిన కార్లకు కూడా నలుపు రంగు వేయాలని సూచించారట.



Updated : 14 Dec 2023 6:48 PM IST
Tags:    
Next Story
Share it
Top