రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంపు..
X
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. 65 స్థానాల్లో హస్తం పార్టీ హవా కొనసాగుతోంది. దీంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు. కాంగ్రెస్ కార్యకర్తలు భారీ తరలివస్తుండడంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అటు కామారెడ్డి, ఇటు కొడంగల్ నియోజకవర్గాల్లో రేవంత్ ముందంజలో ఉన్నారు. దీంతో రేవంత్ ఇంటికి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలు చేజారకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఫలితాల మానిటరింగ్ను కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు కాంగ్రెస్ అప్పగించి. దీంతో శనివారం రాత్రి హైదరాబాద్ వచ్చిన ఆయన.. ఫలితాల సరళిని పరిశీలించి.. భవిష్యత్ ప్రణాళికపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా గెలిచిన అభ్యర్థులను క్యాంపుకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల కోసం తాజ్ కృష్ణలో సుమారు 100 రూమ్స్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. తాజ్ కృష్ణకు వచ్చిన అభ్యర్థులను బెంగళూరులోని ఓ రిసార్టుకు తరలించే అవకాశం ఉంది. దీని కోసం తాజ్ కృష్ణలో బస్సులను సిద్ధంగా ఉంచారు.