Home > తెలంగాణ > ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు

ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు

ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు
X

పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. 2022 ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ లో ఈ కేసు రిజిస్టర్ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, ఆయుధాల చట్టం, ఐపీసీ సెక్షన్ 10 కింద ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు మరో 152 మంది ఉద్యమకారులు, మేధావులను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు. పీపుల్స్‌ డెమొక్రటిక్‌ మూవ్‌మెంట్‌ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని పోలీసులు రెండునెలల క్రితం అరెస్ట్‌ చేయడంతో ఆయన రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్‌ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ సందర్భంగా చంద్రమౌళిపై మరికొన్ని కేసులు ఉన్నాయని పోలీసులు న్యాయమూర్తికి తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వివరాలు అందజేయగా ఈ ఎఫ్ఐఆర్ విషయం బయటపడింది.

మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రభుత్వాన్ని కూలదోయడం, పార్టీకి నిధులు సమకూర్చుకోవడం, అమాయక యువకులను మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్‌ చేసుకోవడం తదితర చర్యలకు పాల్పడినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. చేశారు. నిందితులుగా ఉన్న వారిలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ సురేశ్‌ ప్రొఫెసర్‌ పద్మజా షా, హైకోర్టు సీనియర్‌ అడ్వొకేట్ వీ రఘునాథ్‌, చిక్కుడు ప్రభాకర్‌ తదితరుల ఉన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యేనాటికే జస్టిస్‌ సురేశ్‌ చనిపోయారు.

2022 ఆగస్టు 19న తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ పరిధిలో బీరెల్లి గ్రామంలో మావోయిస్టు పార్టీ సభ్యులు సమావేశామవుతున్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. అయితే పోలీసులు రావడాన్ని పసిగట్టిన మావోయిస్టులు అడవిలోకి పారిపోగా.. అక్కడ విప్లవ సాహిత్యం, పలు వస్తువులు దొరికాయి. ఆ పుస్తకాల్లో మేధావులు, ఉద్యమకారుల పేర్లు ఉండడంతో వారిని పోలీసులు వారిని నిందితులుగా చేర్చారు. ప్రభుత్వాన్ని కూలదోయడంతో పాటు ప్రభుత్వాధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులను హత్య చేయడానికి నిందితులు మావోయిస్టు పార్టీతో కలిసి కుట్ర చేసినట్లు ఎఫ్ఐఆర్లో రాశారు.

sedition case registered against professor haragopal in tadwai police station

telangana,sedition case,professor haragopal,tadwai police station,maoists,ipc section 10,fir,ranga reddy district court,bail petition,chandramouli,professor lakshman

Updated : 15 Jun 2023 10:11 PM IST
Tags:    
Next Story
Share it
Top