కాంగ్రెస్ సీనియర్ నేత మృతి.. శోక సంద్రంలో తెలంగాణ నేతలు
X
మాజీ మంత్రి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి (81) మృతిచెందారు. గురువారం (జులై 20) నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతు మరణించారు. వారం రోజులుగా అనారోగ్య సమస్యలతో బాదపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. రెండు సార్లు మంత్రిగా సేవ చేశారు. ఆయన మృతిపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రామచంద్రారెడ్డి స్వస్థలం చేరుకుని.. నివాళులు అర్పించారు. రామచంద్రా రెడ్డి మరణం పార్టీకి తీరని లోటన్న రేవంత్.. ఆయన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని, నిజాయితీ, క్రమశిక్షణతో రాజకీయాలు చేసిన గొప్ప వ్యక్తి అని పొగిడారు. రామచంద్రారెడ్డి రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 1978, 1985, 1989, 2004 లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2013లో ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.