Home > తెలంగాణ > V. Hanumantha Rao:కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావుకి అస్వస్థత

V. Hanumantha Rao:కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావుకి అస్వస్థత

V. Hanumantha Rao:కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావుకి అస్వస్థత
X

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా ఎంపీగా పోటీ చేసి తీరుతానని చెప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ వీ హనుమంతరావు.. హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే అంబర్‌పేటలో ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తొందరపడుతున్నారు వీహెచ్. ఇటీవలే ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసి తీరుతానని ఓ మీడియా సమావేశంలో అన్నారు. పార్టీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి తర్వాత అంతగా కష్టపడేది తానేనని, అధిష్ఠానం తన క‌ృషిని గుర్తించి, తప్పకుండా టికెట్‌ ఇస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ కోసం త‌న కంటే ఎక్కువ క‌ష్ట‌ప‌డ్డ వాళ్లు ఉన్నారా..? అంటూ ప్రశ్నిస్తూనే కొత్త‌వాళ్లు టికెట్లు అడిగితే త‌న లాంటి సీనియ‌ర్ల ప‌రిస్థితి ఏంటీ..? అని నిలదీశారు. గ‌త ఎన్నిక‌ల్లో కూడా త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని వీహెచ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే ఖ‌మ్మం ఎంపీ టికెట్ కోసం డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క నందిని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే తాను ఖ‌మ్మం ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తాన‌ని స‌హ‌చ‌రుల‌తో చెప్పిన‌ట్లు వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఆమెకు టికెట్ ఖ‌రారు కావ‌డంతోనే రేణుకా చౌద‌రిని రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసిన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి.

Updated : 29 Feb 2024 6:06 PM IST
Tags:    
Next Story
Share it
Top