Home > తెలంగాణ > Janareddy: ప్రభుత్వంలో నా పాత్రేమీ లేదు.. సలహదారుణ్ని మాత్రమే: జానారెడ్డి

Janareddy: ప్రభుత్వంలో నా పాత్రేమీ లేదు.. సలహదారుణ్ని మాత్రమే: జానారెడ్డి

Janareddy: ప్రభుత్వంలో నా పాత్రేమీ లేదు.. సలహదారుణ్ని మాత్రమే: జానారెడ్డి
X

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కె.జానారెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంను జానారెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు గంటసేపు వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా జానారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు. అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి అందరూ సహకరించాలని కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చి, ప్రజాభిమానం సొంతం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించానని తెలిపారు.

సీఎం, మంత్రులు ఐకమత్యంతో పనిచేయాలని కోరారు. ‘ప్రజాభిమానం చూరగొనేలా పనిచేయాలని సీఎం రేవంత్‌కు చెప్పాను. ప్రభుత్వంలో నా పాత్ర ఏమి ఉండదు. నా సలహాలు సూచనలు కావాలంటే ఇస్తా. కొత్త ప్రభుత్వం తమకున్న బాధలు,ఇబ్బందులు వెల్లడించడం శుభపరిణామం ’ అని అన్నారు.

మాజీ సీఎం కేసీఆర్‌కు గాయం కావడం బాధాకరమన్న జానారెడ్డి.. ఆస్పత్రిలో కేసీఆర్ ను కలిసే ప్రయత్నం చేశాను కానీ ఆయన నిద్రలో ఉన్నారని.. దీంతో కేటీఆర్, హరీష్ రావులను కలిసి వచ్చానని చెప్పారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని.. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తన సూచనలు ఇవ్వాలని కోరారు. పార్టీ ఆదేశిస్తే నల్గొండ పార్లమెంట్‌కి పోటీ చేస్తానని అన్నారు జానారెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో 15 ఏళ్లు మంత్రిగా ఉన్నానని చెప్పారు. తన కుమారుడు జైవీర్‌కు పదవి ఇవ్వాలని అడగలేదని, ప్రస్తుతం అతడు ఎమ్మెల్యేగా ఉన్నాడని.. ఇప్పుడే పదవులు అడగలేమని అన్నారు. ఇవ్వడం కూడా సమంజసం కాదని స్పష్టం చేశారు జానారెడ్డి.

Updated : 11 Dec 2023 1:37 PM IST
Tags:    
Next Story
Share it
Top