Home > తెలంగాణ > Warangal BRS : వరంగల్ బీఆర్ఎస్కు వరుస షాక్లు..పార్టీని వీడుతున్న ముఖ్య నేతలు

Warangal BRS : వరంగల్ బీఆర్ఎస్కు వరుస షాక్లు..పార్టీని వీడుతున్న ముఖ్య నేతలు

Warangal BRS : వరంగల్ బీఆర్ఎస్కు వరుస షాక్లు..పార్టీని వీడుతున్న ముఖ్య నేతలు
X

లోక్సభ ఎన్నికల వేళ వరంగల్ బీఆర్ఎస్​కు వరుస షాక్ లు తగులుతున్నాయి. అధికారం చేజారేసరికి ఒకరి తర్వాత ఒకరు వరుసగా గులాబీ పార్టీని వీడుతున్నారు. దీంతో వరంగల్ లో బీఆర్ఎస్ తన పట్టును కొల్పోతుంది. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి హాస్తం గూటికి చేరారు. తాజాగా మేయర్ గుండు సుధారాణి సైతం పార్టీ మారుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే వరంగల్ లో బీఆర్ఎస్ దాదాపు సగం ఖాళీ అయినట్లే.

వరంగల్ పరిధిలో కార్పొరేటర్లు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేందుకు వరుసగా క్యూ కడుతున్నారు. అటు వరంగల్, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలోని పలువురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.అయితే రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రెండు టర్మ్ లలో గ్రేటర్‍ వరంగల్‍ మేయర్‍ పీఠం బీఆర్ఎస్ చేతుల్లోనే ఉంది. మేయర్ గుండు సుధారాణి సైతం కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. మేయర్ తో పాటు పలువురు లీడర్లు, కార్పొరేటర్లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారట. అయితే మంత్రి పొంగులేటితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

గత ఎన్నికల్లో 48 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. తర్వాత ఇతర పార్టీలకు చెందిన ముగ్గురిని చేర్చుకోవడంతో బీఆర్ఎస్ బలం 51కి చేరింది. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడడంతో సీన్ మారిపోయింది. ఇప్పటికే గ్రేటర్ వరంగల్ కు చెందిన 8 మంది కార్పొరేటర్లు పార్టీ మారారు. ఇందులో ఏడుగురు కాంగ్రెస్ లో చేరగా, మరోకరు బీజేపీలోకి చేరారు.





మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తొందరలోనే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి మోదీ సమక్షంలో పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ మారనున్న నేతలను బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. వరంగల్ సీనియర్ నాయకులతో భేటీ అవుతూ లీడర్లూ చేజారకుండా మంతనాలు జరుపుతోంది. నగరంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా తమ మార్క్ ఉండాలన్న ఉద్దేశంతో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ లీడర్లు అడుగులు సర్వశక్తుల ప్రయత్నిస్తున్నారు. గులాబీ నేతలను కారు దించేందుకు అక్కడి కాంగ్రెస్ నేతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతుండడంతో..వరంగల్ లో బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పొతుంది.




Updated : 4 March 2024 11:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top