మిగిలిన నాలుగు గ్యారంటీల అమలుపై కీలక నిర్ణయం
X
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మొదటిసారి తెలంగాణ భవన్ లో పీఎసీ సమావేశం నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. మంత్రులు. ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ.. భేటీలో చర్చించిన ముఖ్య అంశాలపై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేసినట్లు తెలిపారు. మిగతా నాలుగు హామీల అమలు సమావేశంలో చర్చించినట్లు షబ్బరీ అలీ చెప్పారు.
మహిళలకు నెలకు రూ.2,500 పథకం, రూ.4 వేల పించన్ అమలుపై సుధీర్ఘంగా చర్చలు జరిపినట్లు చెప్పుకొచ్చారు. కాగా డిసెంబర్ 28న మరోసారి పార్టీ సభ్యులు భేటీ అయి.. పించన్ ల అమలుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరికొన్ని పథకాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉందని షబ్బీర్ అలీ అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో సాగునీటీ ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి సారించాలని అన్నారు.