Home > తెలంగాణ > దుబాయ్ వెళ్లే విమానం హైజాక్.. దుండగుల బ్లాక్‌ 'మెయిల్'

దుబాయ్ వెళ్లే విమానం హైజాక్.. దుండగుల బ్లాక్‌ 'మెయిల్'

దుబాయ్ వెళ్లే విమానం హైజాక్.. దుండగుల బ్లాక్‌ మెయిల్
X

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్‌ వచ్చింది. శంషాబాద్ నుంచి దుబాయ్ కి వెళ్లే విమానం హైజాక్ చేయబోతున్నట్లు దుండగులు ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో ఎయిర్ పోర్టులో తీవ్ర కలకలం రేగింది. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది దుబాయ్ వెళ్లే విమానంలో తనిఖీలు చేపట్టారు. మరికాసేపట్లో రన్‌వే పైనుంచి బయల్దేరనుండగా ఆ విమానాన్ని నిలిపేసి ప్రయాణికుల లగేజీని తనిఖీ చేశారు. పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించిన తర్వాత తిరుపతి, వినోద్‌, రాకేశ్‌ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురూ దుబాయ్‌ మీదుగా ఇరాక్‌ వెళ్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత వారిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. అనంతరం విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులను హోటల్ కు పంపించిన సిబ్బంది.. మరో విమానంలో దుబాయ్‌ పంపించనున్నట్లు తెలిపారు.

అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనతో అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దుబాయ్ వెళ్లే AI 951 విమానాన్ని హైజాక్ చేశాం అంటూ ఈ- మెయిల్ వచ్చేసరికి అధికారుల్లో కలకలం రేగింది. కానీ అది ఫేక్ మెయిల్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న తిరుపతి బాదినేని, ఎల్. వినోద్ కుమార్, పి. రాకేశ్ కుమార్ లను విచారిస్తున్నారు. వీరికి ఓ మహిళ కూడా సహకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరు..? వీరు ఎందుకు అటువంటి మెయిల్ పంపించారు..? దానికి కారణమేంటి..? ఏదైనా ప్లాన్ తోనే చేశారా..? లేదా ఆటపట్టింటానికి ఆకతాయితనంగా చేశారు..? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు.




Updated : 9 Oct 2023 10:39 AM IST
Tags:    
Next Story
Share it
Top