Home > తెలంగాణ > Shamshabad AirPort : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు

Shamshabad AirPort : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు

Shamshabad AirPort : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు
X

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలజడి రేగింది. విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు జీఎంఆర్ కస్టమర్ కేర్ నంబర్‌కు ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో అధికారులు ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. ఫోన్ నంబర్ ను ట్రేస్ చేసిన పోలీసులు.. ముంబైకి చెందిన వ్యక్తి ఫోన్ చేసినట్లుగా గుర్తించారు. తాగిన మైకంలో అతడు ఫోన్ చేసినట్లు సమాచారం.

Updated : 21 Jan 2024 7:45 PM IST
Tags:    
Next Story
Share it
Top