Home > తెలంగాణ > కాంగ్రెస్తో కలిసి నడిచేందుకు సిద్ధం: షర్మిల

కాంగ్రెస్తో కలిసి నడిచేందుకు సిద్ధం: షర్మిల

కాంగ్రెస్తో కలిసి నడిచేందుకు సిద్ధం: షర్మిల
X

వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, తన YSRTపార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారని.. గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై షర్మిల క్లారిటీ ఇచ్చారు. మంగళవారం (జనవరి 2) హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని YSRTP ఆఫీస్‌లో పార్టీ ముఖ్య సభ్యులు భేటీ అయ్యారు షర్మిల. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తున్నట్లుగా పార్టీ నేతలకు స్పష్టం చేశారు. జనవరి 4న YSRTPని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల.. కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

బుధవారం (జనవరి 3) ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనే ఉద్దేశంతోనే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదని తెలిపారు. వైఎస్ఆర్టీ పార్టీ మద్దతుతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. తెలంగాణలో 31 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం.. ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయకపోవడమేనని చెప్పుకొచ్చారు. రెండు రోజుల్లో అన్ని విషయాలు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని షర్మిల స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపయినర్ గా పనిచేస్తానని షర్మిల చెప్పారు. భవిష్యత్తులో ఖమ్మం లేదా నల్గొండ ఎంపీగా పోటీ చేస్తానని అన్నారు. AICC జనరల్ సెక్రటరీ ఇస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని అన్నారు.

Updated : 2 Jan 2024 6:44 PM IST
Tags:    
Next Story
Share it
Top