Home > తెలంగాణ > తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్.. వార్ రూం ఇంఛార్జ్గా మాజీ ఐఏఎస్

తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్.. వార్ రూం ఇంఛార్జ్గా మాజీ ఐఏఎస్

తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్.. వార్ రూం ఇంఛార్జ్గా మాజీ ఐఏఎస్
X

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఫోకస్ పెంచింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్ ను గద్దెదింపి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే హైకమాండ్ సైతం పార్టీని మరింత బలోపేతం చేసేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ వార్ రూం ఇంఛార్జిగా కోర్ కమిటీ మెంబర్ ను నియమించింది. మాజీ ఐఏఎస్ అధికారైన శశికాంత్ సెంథిల్ కు ఆ బాధ్యతలు అప్పజెప్పింది.

తమిళనాడుకు చెందిన సెంథిల్ 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. NRCకి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో సెంథిల్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 నుంచి సర్విద్య సంఘానికి బాధ్యత వహిస్తున్నాడు. శశికాంత్ సెంథిల్ వ్యూహాలు అమలు చేయడంలో దిట్ట. కర్నాటక ఎన్నికలకు వార్ రూమ్ ఇంచార్జ్ గా పనిచేసిన సెంథిల్ అక్కడ ఎన్నికల్లో ప్రధాన నినాదమైన 40శాతం కమిషన్ సర్కార్ కూడా ఆయన ఆలోచనే. ప్రభుత్వ వైపల్యాలు గ్రౌండ్ లెవల్కు ఎలా తీసుకెళ్లాలో ప్లాన్ చేయడంలో సెంథిల్ మాస్టర్ మైండ్. నాయకుల మధ్య సమన్వయం పెంచడంలో సిద్ధహస్తుడైన సెంథిల్ తెలంగాణ పరిస్థితులను చక్కబెట్టగలడనే నమ్మకంతోనే రాహుల్ సెంథిల్ ను తెలంగాణకు పంపినట్లు సమాచారం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉందని కొన్ని వ్యూహాలతో పార్టీని అధికారంలోకి తీసుకు రావచ్చని సెంథిల్ వార్ రూం సభ్యులతో చెప్పినట్లు సమాచారం. కర్నాటకలో 8 నెలల్లో గ్రౌండ్ లెవల్ కు రీచ్ అయ్యామని, తెలంగాణలో కేవలం నాలుగు నెలల సమయం ఉన్నా సరిపోతుందని సెంథిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.



telangana,congress,tpcc chief,revanth reddy,core committee members,war room incharge,former ias,shashikanth senthil,nrc,revanth reddy,rahul gandhi,assembly election

Updated : 1 Aug 2023 4:22 PM IST
Tags:    
Next Story
Share it
Top