Home > తెలంగాణ > రాకేష్ మాస్టర్ గురించి మీకు తెలిసింది 5 శాతమే..శేఖర్ మాస్టర్

రాకేష్ మాస్టర్ గురించి మీకు తెలిసింది 5 శాతమే..శేఖర్ మాస్టర్

రాకేష్ మాస్టర్ గురించి మీకు తెలిసింది 5 శాతమే..శేఖర్ మాస్టర్
X

హైదరాబాద్‎లోని యూసఫ్‎గూడలో రాకేష్ మాస్టర్ పెద్ద కర్మ కార్యక్రమం జరిగింది. ఆయన శిష్యులు శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు పాల్గొని శేఖర్ మాస్టర్‎కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. రాకేష్ మాస్టర్‎తో ఆయనకున్న బాండింగ్‎ను గుర్తు చేసుకుని భావోద్వేగమయ్యారు. రాకేష్ మాస్టర్ గురించి నిజాలు మాత్రమే రాయాలని యూట్యూబ్ ఛానెల్స్‎ను ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ రిక్వెస్ట్ చేశారు.

‘‘రాకేష్ మాస్టర్‌ చాలా గొప్ప డ్యాన్సర్‌. మా ఇద్దరిదీ 8 ఏళ్ల అనుబంధం. ఆయన డ్యాన్స్‌ టాలెంట్ గురించి మీకు తెలిసింది కేవలం 5 శాతమే. ప్రభుదేవా మాస్టర్ స్ఫూర్తితో ఈ రంగంలోకి వచ్చాను. హైదరాబాద్‌ వచ్చాక రాకేష్ మాస్టర్‌‎పైన అభిమానం పెంచుకున్నాను. నేను ఆయనకు శిష్యుడిని అయినందుకు గర్వంగా ఫీలవుతాను. ఎందుకంటే ఆయన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అంత అద్భుతంగా ఉంటుంది. డ్యాన్స్ ప్రాక్టీస్‌ చేసే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అస్సలు ఊరుకునేవారు కాదు.

ఆయన ఎలా ఉన్నా, ఎక్కడున్నా బాగుండాలని ఆశించాను. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఆయనకు మేమే పెళ్లి చేశాం. ఎప్పుడూ మాస్టర్‌ దగ్గరే ఉండేవాళ్లం. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లు వారికి నచ్చినట్లు రాకేష్ మాస్టర్ గురించి వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు ప్లే చేస్తున్నాయి. రకరకాలుగా థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు. అలాంటి వాటి వల్ల చాలామంది ఫీల్ అవుతున్నారు. ఈయన విషయంలోనే కాదు ఎవరి విషయంలోనైనా నిజాలు మాత్రమే రాయండి. లేదంటే మానేయండి’’ అని శేఖర్‌ మాస్టర్‌ సూచించారు.

రాకేష్ మాస్టర్ తన శిష్యుల్లో శేఖర్ అంటే చాలా ఇష్టమని పలు ఇంటర్వ్యూల్లో చెప్పేవారు. అయితే వీరిద్దరూ మనస్పర్థలతో మాట్లాడుకోవడం లేదని దూరంగా ఉంటున్నారని పలు యూట్యూబ్‌ ఛానెళ్లు వార్తలు వేశాయి. ఈ రూమర్‎పైన శేఖర్‌ మాస్టర్‌ స్పందించారు.

Updated : 29 Jun 2023 1:45 PM IST
Tags:    
Next Story
Share it
Top