Home > తెలంగాణ > డ్రైవర్, అటెండర్ను కూడా.. కాస్ట్లీ కార్లు గిఫ్ట్గా ఇచ్చి మరీ..!

డ్రైవర్, అటెండర్ను కూడా.. కాస్ట్లీ కార్లు గిఫ్ట్గా ఇచ్చి మరీ..!

డ్రైవర్, అటెండర్ను కూడా.. కాస్ట్లీ కార్లు గిఫ్ట్గా ఇచ్చి మరీ..!
X

రెరా సెక్రటరీ శివబాలకృష్ణ అవినీతి కేసులో రోజుకో విస్తుపోయే విషయం బయటికి వస్తుంది. ఇటీవల ఆయన బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టేయగా.. ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రాథమిక నివేదికను ఏసీబీ ప్రభుత్వానికి అందజేసింది. శివ బాలకృష్ణతో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్న సంబంధాలపై ఆరా తీస్తుంది. అరవింద్ కుమార్ను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది. శివ బాలకృష్ణ దగ్గర ఐఏఎస్ అరవింద్ కుమార్ భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈ కేసులో దూకుడు పెంచిన ఏసీబీ.. శివబాలకృష్ణ బినామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణిలకు నోటీసులిచ్చింది. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. శివబాలకృష్ణ దర్యాప్తులో దొరికిన ఆధారాలు, పత్రాల ఆధారంగా ఏసీబీ విచారించనుంది. దీంతోపాటు ఆయన ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను నిలిపేయాలని కలెక్టర్ కు ఏసీబీ లేఖ రాసింది.

తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. శివబాలకృష్ణ తన పేరిటే కాకుండా.. ఇంట్లోవాళ్లు, దగ్గరి దూరపు బంధువులు, ఇంట్లో పనివాళ్లు, డ్రైవర్ల పేరిట కూడా భారీగా ఆస్తుల్ని జమ చేశారు. తాజాగా ఏసీబీ ఆయన దగ్గర అటెండర్, డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరి పేరిట భారీగా బినామీ ఆస్తుల్ని శివబాలకృష్ణ కూడబెట్టినట్లు అనుమానాలు వచ్చిన నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకుని విచారించింది. వారి విచారణలో.. శివబాలకృష్ణ లంచాలు చేరవేయడంలో ఈ ఇద్దరు కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో డ్రైవర్ కు శివబాలకృష్ణ హోండా సిటీ కారును కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి పైన ఉన్న బినామీ ఆస్తుల వివరాలను గుర్తించే పనిలో ఉంది ఏసీబీ.


Updated : 14 Feb 2024 7:20 PM IST
Tags:    
Next Story
Share it
Top