Home > తెలంగాణ > ఏపీ బీజేపీ నేతలకు షాక్.. ఒక్క స్థానాన్ని కూడా ప్రకటించని అధిష్టానం

ఏపీ బీజేపీ నేతలకు షాక్.. ఒక్క స్థానాన్ని కూడా ప్రకటించని అధిష్టానం

ఏపీ బీజేపీ నేతలకు షాక్.. ఒక్క స్థానాన్ని కూడా ప్రకటించని అధిష్టానం
X

లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాల పేర్లతో కూడిన తొలిజాబితాలో మొత్తం 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ తరుణంలో 34 మంది కేంద్ర మంత్రులు మరోసారి టికెట్‌ను పొందారు. బీజేపీ తొలి జాబితాలో వివిధ రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో తెలంగాణ నుంచి 9 మందికి టికెట్ దక్కింది. అయితే ఏపీలో ఒక్కరికి కూడా స్థానం దక్కలేదు.

ఏపీలో టీడీపీతో జతకట్టిన జనసేన పార్టీ వైసీపీని ఢీకొంటోంది. అయితే జనసేన తమ భాగస్వామ్య పార్టీ అని చెప్పుకుంటూ వస్తున్న బీజేపీ ఏపీ రాజకీయ పరిస్థితులపై ఆలోచనలో పడింది. టీడీపీ, జనసేన పొత్తుతో బీజేపీకి షాక్ తగిలినట్లు అయ్యింది. తొలి జాబితాలో ఏపీ అభ్యర్థులను ప్రకటించకపోవడం చూస్తుంటే ఆ రెండు పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడం కోసం చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఒక వేళ టీడీపీ, జనసేనతో పొత్తు కుదుర్చుకుంటే బీజేపీ తర్వాతి జాబితాలో ఏపీ అభ్యర్థులకు స్థానం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Updated : 2 March 2024 9:37 PM IST
Tags:    
Next Story
Share it
Top