హైదరాబాద్ ఈసీఐఎల్ స్పెషల్.. పాము సాంబార్
X
టైటిల్ చూసి షాక్ అయ్యారా? పాము సాంబార్ డిష్‌ను రుచి చూసేందుకు రెడీ అయ్యారా. అయితే మీరు అనుకున్నట్లు ఇదేదో కొత్త రకం వంటకం మాత్రం కాదు సుమా. హైదరాబాద్‌లో ఓ క్యాంటీన్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం అని చెప్పక తప్పదు. ఇప్పటివరకు హాస్టళ్లలోని మెస్‌లలో , హోటల్స్‌లో అందించే వంటకాల్లో బల్లులు, పురుగులు, బొద్దింకలు పడటం వినుంటాం..చూసుంటాం..కానీ ఈసీఐఎల్ లాంటి పెద్ద కంపెలోని క్యాంటీన్లో వడ్డించే సాంబార్లో ఒక్కసారిగా పాము పిల్ల కనిపించడంతో సిబ్బంది మొత్తం షాక్‌లో పడిపోయింది. పాము ఎక్కడి నుండి వచ్చిందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. సాంబార్లో పాము ప్రత్యక్షం కావడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ షాకింగ్ సంఘటన ఈసీఐఎల్ కంపెనీలో శుక్రవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్నం లంచ్ కోసం ఏర్పాటు చేసిన సాంబారులో పాము పిల్ల చనిపోయింది. ఈ విషయం తెలియక అప్పటికే చాలా మంది సాంబార్ తిన్నారు. దీంతో పలువులు ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన
సిబ్బంది వారిని స్థానికంగా ఉన్న హాస్పిటల్‌కు తరలించారు. అయితే పాము పిల్ల వంటకాల్లో కనిపించడంతో ఎంప్లాయిస్ అవాక్కయ్యారు. ఇదే అంశంపై క్యాంటీన్ నిర్వహకులు విస్తుపోతున్నారు.