Home > తెలంగాణ > కొత్త ఆచారం.. సంక్రాంతికి ముందు 5 రకాల గాజులు ధరించాలా?

కొత్త ఆచారం.. సంక్రాంతికి ముందు 5 రకాల గాజులు ధరించాలా?

కొత్త ఆచారం.. సంక్రాంతికి ముందు 5 రకాల గాజులు ధరించాలా?
X

అంతరిక్షంలోకి ఇస్రో ప్రయోగించే రాకెట్స్ ఎంత వేగంగా వెళతాయో.. మూఢనమ్మకాలపై కొందరు పుట్టించే పుకార్లు సైతం అంతే వేగంగా జనాల్లోకి వెళుతున్నాయ్. ప్రస్తుతం ప్రతీ పల్లెలోనూ, పట్టణంలోనూ అమ్మలక్కలంతా ఒకచోట చేరి జరిపే చర్చంతా ఒక విషయం గురించే." ఈ ఏడాది సంక్రాంతి పండక్కి కీడు వచ్చింది. ఆ కీడు పోవాలంటే ఒక్కడే కొడుకు ఉన్న మహిళలు వెంటనే.. 5 రంగుల గాజులు వేయించుకోవాలి. అదీ కూడా తమ వద్దనున్న డబ్బులతో కాకుండా.. ఐదుగురు ముత్తైదువల వద్ద డబ్బులు అడుక్కొని, ఆ డబ్బుతో 5 రంగుల గాజులు కొనుక్కుని వాటిని ధరించాలి. అదీ కూడా సంక్రాంతి పండగ లోపు పూర్తి చేయాలి. అలా చేయకుంటే కీడు తప్పదంటూ ఓ పుకారు పట్టణాల నుంచి పల్లెల వరకు స్పీడ్‌గా పాకుతోంది. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ విషయం చెవిన పడ్డ ఒక్క మగసంతానం కలిగిన మహిళలంతా.. ఇద్దరు కుమారులు కలిగిన తమ బంధువులు, ఫ్రెండ్స్ వద్ద నుంచి డబ్బులు తీసుకుని గాజులు ధరిస్తున్నారు. అలా తాము ధరించిన గాజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్.. ఇలా ఏదీ చూసినా గాజుల సవ్వళ్లు కనపడుతున్నాయ్. వీటిని చూసి, నిజమని నమ్మి మరికొందరు ఈ ట్రేడిషన్ ను ఫాలో అవుతున్నారు. ఇంకొందరు ఇదంతా ఉత్తిదే అని వాదిస్తున్నారు. గతంలోనూ సంక్రాంతి, ఉగాదితో పాటు వివిధ పండగలకు ముందు అన్నదమ్ముల్లకు కుడుకలు ఇవ్వాలి, ఆడబిడ్డలకు కుంకుమ భరణాలు, వదిన మరదళ్లు చీరలు పంచుకోవాలి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సందర్భాలు ఉన్నాయి. తిరుపతిలో అఖండ జ్యోతి కొండక్కెందని.. అందుకు పరిహారంగా ప్రతీ ఇంట్లో కొబ్బరికాయలు కొట్టాలని ప్రచారాలు జోరుగా సాగాయి. ఈసారి సంక్రాంతికి ముందు ఐదు రకాల గాజులు ధరించకుంటే కీడు తప్పదంటూ కొత్త పుకారు తెరమీదకు తీసుకవచ్చారు. ఇదంతా ఆయా చిరువ్యాపారులు చేస్తున్న జిమ్మిక్కులేనని, వీటిలో ఎటువంటి నిజం లేదని విద్యావేత్తలు చెబుతున్నారు. ఇటువంటి ప్రచారంతో ఆయా వ్యాపారులే లబ్ధి పొందుతారు తప్ప ఎవరికి ఏ కీడు జరగదని వాదిస్తున్నారు.

Updated : 9 Jan 2024 6:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top