Home > తెలంగాణ > గద్దర్ అంతిమయాత్రలో విషాదం.. సియాసత్ పేపర్ ఎండీ మృతి

గద్దర్ అంతిమయాత్రలో విషాదం.. సియాసత్ పేపర్ ఎండీ మృతి

గద్దర్ అంతిమయాత్రలో విషాదం.. సియాసత్ పేపర్ ఎండీ మృతి
X

గద్దర్ అంతిమయాత్రలో విషాదం చోటుచేసుకుంది. గద్దర్ ఇంటి వద్ద సియాసత్ ఉర్దూ పేపర్ ఎండీ జహీరుద్దీన్ అలీ ఖాన్‌ గుండె పోటుతో మరణించారు. జహీరుద్దీన్ గద్దర్కు అత్యంత ఆప్తుడు. ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ ఇంటివరకు సాగిన అంతిమయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఇంటి వద్ద ఛాతిలో నొప్పి వస్తుందంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

గద్దర్ కు కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రజలు భారీగా తరలిచ్చారు. అభిమానులు, శ్రేయోభిలాషులు అశ్రునయనాలతో నివాళులు అర్పించారు. ఎల్బీ స్టేడియం నుంచి మొదలైన గద్దర్ అంతిమయాత్ర అల్వాల్లోని ఆయన ఇంటివరకు సాగింది. అక్కడ సీఎం కేసీఆర్ సహా పలువురు నివాళులు అర్పించారు. అల్వాల్లోని మహాభోది స్కూల్ గ్రౌండ్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.



Updated : 7 Aug 2023 7:52 PM IST
Tags:    
Next Story
Share it
Top