Siddipet Collector Gunmen : కలెక్టర్ గన్మెన్ బలవన్మరణం.. భార్యా పిల్లలను..
X
సిద్దిపేట్ జిల్లా చిన్నకోడురు మండలంలోని రామునిపట్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భార్యా పిల్లలను చంపి.. (Siddipet Collector Gunmen) కలెక్టర్ గన్ మెన్ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద గన్ మెన్ గా పనిచేస్తున్న ఆకుల నరేశ్ (35) డ్యూటీలో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై విచారణ జరపగా.. ఆన్ లైన్ బెట్టింగ్ల వద్ద భారీగా నష్టపోయిన నరేశ్ అప్పులపాలయ్యాడు. ఇదే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో మాటమాట పెరగడంతో ఆగ్రహంలో నరేశ్.. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని, భార్యను తుపాకీతో కాల్చి చంపాడు.
అనంతరం తాను కూడా కాల్చుకుని చనిపోయాడు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన సీపీ శ్వేత.. ‘గన్ మెన్ నరేశ్ సర్వీస్ రివాల్వర్ తో తన కుటుంబాన్ని కాల్చి, తర్వాత తానుకూడా కాల్చుకూడా చనిపోయాడు. అతనికి అప్పులు ఉన్నట్లు ప్రాథమికంగా తెలిసింది. నరేశ్ ఆన్ డ్యూటీలో ఉండగానే ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం అతని ఫోన్ ను స్వాధీనం చేసుకున్నాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా’మని తెలిపారు.