Home > తెలంగాణ > కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడికి 14 రోజుల రిమాండ్

కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడికి 14 రోజుల రిమాండ్

కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడికి 14 రోజుల రిమాండ్
X

దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి కేసు నిందితుడు రాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జైన అనంతరం నిందితున్ని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి జ్యూడీషియల్ రిమాండ్ కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు దాడికి సంబంధించిన వివరాలను సిద్ధిపేట సీపీ శ్వేత మీడియాకు వెల్లడించారు. అక్టోబర్ 30న సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిందని చెప్పారు. ఆ ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించామని అన్నారు. దాడి చేసిన వ్యక్తి రాజు పలు న్యూస్ ఛానళ్లలో రిపోర్టర్గా పని చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు.

నిందితుడు రాజు వారం క్రితమే కత్తి కొనుగోలు చేసి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేయాలని ప్లాన్ చేసుకున్నాడని సీపీ శ్వేత చెప్పారు. నిందితుడు రాజు సెన్సేషనల్ క్రియేట్ చేయడానికే ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీపీ శ్వేత చెప్పారు. నిందితునికి ఎవరైనా సహకరించారా..? లేదా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఎవరూ విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టవద్దని హెచ్చరించారు.




Updated : 1 Nov 2023 2:42 PM GMT
Tags:    
Next Story
Share it
Top