Home > తెలంగాణ > సిద్ధిపేటకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు.. హరీష్ రావు హర్షం

సిద్ధిపేటకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు.. హరీష్ రావు హర్షం

సిద్ధిపేటకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు.. హరీష్ రావు హర్షం
X

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో సిద్దిపేట మరోసారి సత్తా చాటింది. జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ కీర్తి పతాకలో సిద్దిపేట మరో మైలురాయిని అందుకుందని అన్నారు. అవార్డులు అంటేనే సిద్దిపేట.. సిద్దిపేట అంటే అవార్డులు అని మరోసారి రుజువైందని చెప్పారు. ప్రజల సహకారం, ప్రజాప్రతినిధుల చొరవ, అధికారుల పనితీరుకు ఈ అవార్డు నిదర్శనమన్నారు. కాగా 2021లోనూ స్వచ్ఛ సర్వేక్షణ్లో జాతీయ స్థాయిలో సిద్ధిపేట అవార్డు సాధించింది.

Updated : 5 Jan 2024 8:15 PM IST
Tags:    
Next Story
Share it
Top