Home > తెలంగాణ > ఈ టిప్స్ పాటిస్తే ...నార్మల్ డెలివరీ గ్యారెంటీ

ఈ టిప్స్ పాటిస్తే ...నార్మల్ డెలివరీ గ్యారెంటీ

ఈ టిప్స్ పాటిస్తే ...నార్మల్ డెలివరీ గ్యారెంటీ
X

ప్రెగ్నెంట్ అయ్యింది మొదలు డెలివరీ అయ్యే వరకూ మహిళలు చాలా టెన్స్ ఫీల్ అవుతుంటారు. వారి ఆలోచనలు మొత్తం డెలివరీపైనే ఉంటాయి. ఎప్పుడూ డెలివరీ అవుతుంది. ఎలా జరుగుతుంది. నార్మల్ డెలివరీ అయితే బాగుండని భావిస్తుంటారు. కానీ,ప్రస్తుత కాలంలో ఈ అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. హాస్పిటల్‏కి వెళ్లామంటే చాలు.. ఏవేవో కారణాలు చెప్పి ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీస్తున్నాయి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్. ప్రస్తుత కాలంలో డెలివరీ అంటే ఆపరేషన్ జరగాల్సిందే. కోతలు లేకుండా అసలు ప్రసవాలే జరగడంలేదు. అప్పట్లో చాలా వరకూ నార్మల్ డెలివరీలే అయ్యేవి. కానీ, ఇప్పుడు నూటికి 99 శాతం వరకూ సిజేరియన్ చేసే బిడ్డను బయటికి తీస్తున్నారు. ఇలా కాకుండా నార్మల్ డెలివరీ అయ్యేందుకు కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.


స్ట్రెంత్, స్టామినా,స్ట్రెస్‎పైన దృష్టి అవసరం :

నార్మల్ డెలివరీ కావాలంటే గర్భిణీలు తప్పనిసరిగా స్ట్రెంత్, స్టామినా,స్ట్రెస్ పైన దృష్టి సారించాలి. గర్భిణీల్లో మజిల్ , బోన్ స్ట్రెంత్ చాలా ముఖ్యం. మజిల్ స్ట్రెంత్ పెరగాలంటే మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఆకుకూరలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక బోన్ స్ట్రెంత్ కోసం ఎలాగూ డాక్టర్లు క్యాల్షియం సప్లిమెంట్స్ ఇస్తారు. వాటితో పాటే పాలు, పెరుగు, బటర్ , పన్నీర్ , ఛీజ్ వంటి ఆహారాలను తీసుకుంటూ ఉండాలి. ఇక లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు తల్లికి మంచి స్టామినా అవసరం. స్టామినా ఉంటేనే పురుటి నొప్పులు వచ్చినప్పుడు బేబీని పుష్ చేయగలుగుతుంది. అయితే స్టామినాని, స్ట్రెంత్‎ని తొమ్మిదో నెలలోనే బిల్డమ్ చేసుకుంటామంటే కుదరదు. ప్రెగ్నింట్ అని తెలిసినప్పటి నుంచి కాబోయే తల్లులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే హెల్దీ డైట్‎తో స్టామినాను పెంచుకోవాలి.

కాబోయే తల్లులు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు. ఒత్తిడి పెరగడం వల్ల కార్టిసాల్ లెవెల్స్, ఎపినెఫ్రిన్ హార్మోన్స్ విడుదల అవుతాయి. ఆ హార్మోన్లు విడుదలైతే యూట్రెన్ కాంట్రాక్షన్స్ ను ఇండ్యూస్ చేస్తాయి దీనివల్ల నొప్పులు వస్తాయి. ఒక్కోసారి బేబీపైన స్ట్రెస్ పడి ఉమ్మనీరులో మోషన్ వదులుతుంది. దీని వల్ల సిజేరియన్ చేయాల్సి వస్తుంది. అందుకే తల్లులు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు.

వ్యాయామాలతో మెరుగైన ఫలితం :

గర్భిణీలు హెల్దీ న్యూట్రీషియన్ డైట్ తీసుకోవాలి. అన్నం తినగానే వెంటనే కూర్చోవడం, పడుకోవడం చేయకూడదు. తిన్న తరువాత 15 నిమిషాల వరకు వాకింగ్ చేయాలి. ఇక గర్భిణీల్లో 36 వారాల తర్వాత బేబీ తల కిందికి జారుతుంది. కాబట్టి ఆ సమయంలో ప్రతి రోజు 30 నిమిషాల వరకు వాక్ చేయాలి. ప్రతి రోజు నడవటం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. పెల్విక్ మజిల్, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కి రక్తం సరఫరా పెరుగుతుంది. వాకింగ్‎తో పాటు యోగా డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. యోగా చేయటం వల్ల శరీరంలో జాయింట్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇక బటర్ ఫ్లై వ్యాయామాలు పెల్విక్ మజిల్స్ రిలాక్స్ అయ్యేందుకు సహాయం చేస్తాయి. సుమో స్క్వాటింగ్ వ్యాయామం కూడా పెల్విక్ బోన్స్ వైడ్ అయ్యేందుకు సహాయం చేస్తాయి. వీటితో పాటే డక్ వాక్ చేస్తుండాలి. ఇలా వ్యాయామాలతో పాటు ప్రతి రోజు 4 నంచి 6 లీటర్ల వరకు నీరు తీసుకోవాలి. రోజూ మధ్యాహ్నం ఓ అరగంట పడుకోవాలి. ఇక రాత్రిళ్లు 7 నుంచి 8 గంటల లోపే నిద్రపోవాలి. ఈ టిప్స్ పాటిస్తే కచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మీరు ఏదైనా చేసే ముందు వైద్యుని సలహాలు, సూచనలు తీసుకునే ట్రై చేస్తే చక్కటి ఫలితాలను పొందవచ్చు.


Updated : 8 Dec 2023 5:04 AM GMT
Tags:    
Next Story
Share it
Top