Home > తెలంగాణ > సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్..1450 కోట్లు విడుదల

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్..1450 కోట్లు విడుదల

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్..1450 కోట్లు విడుదల
X

సింగరేణి కార్మికులకు యాజమాన్యం గుడ్‌ న్యూస్ తెలిపింది. గని కార్మికులకు చెల్లించాల్సిన 11వ వేతన ఒప్పందం బకాయిలను విడుదల చేసింది. మొత్తం 39,413 మంది సింగరేణి ఉద్యోగులకు రూ.1,450 కోట్లు జమచేసింది. ఒక్కో కార్మికుడికి సుమారు 4లక్షల వరకు జమ కానుంది. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలను చెల్లించడం సింగరేణి చరిత్రలోనే తొలిసారి అని అధికారులు చెప్పారు.

దసరా బోనస్ రూ. 1000 కోట్లు..

మరోవైపు సింగరేణి కార్మికులకు దసరా - దీపావళి బోనస్‌గా రూ.1000 కోట్ల బోనస్ ఇస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. పోయిన దసరా పండుగకు కేవలం రూ.368 కోట్ల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం రూ. 1000 కోట్లు ప్రకటించింది. గత ప్రభుత్వాలు నష్టాల్లోకి నెట్టిన సింగరేణి కాలరీస్‌ను బీఆర్ఎస్ లాభాల్లోకి తీసుకొచ్చిందన్నారు. కంపెనీ టర్నోవర్‌ను రూ.12 వేల కోట్ల నుంచి రూ.33 వేల కోట్లకు పెంచినట్లు సీఎం వివరించారు.


Updated : 21 Sept 2023 2:46 PM IST
Tags:    
Next Story
Share it
Top