Home > తెలంగాణ > Singareni : సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. ఒక్కో కార్మికుడికి రూ. 4 లక్షలు!

Singareni : సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. ఒక్కో కార్మికుడికి రూ. 4 లక్షలు!

Singareni : సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. ఒక్కో కార్మికుడికి రూ. 4 లక్షలు!
X

సింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. గని కార్మికులకు చెల్లించాల్సిన 11వ వేతన ఒప్పందం బకాయిలను నెలలోపు విడుదల చేస్తామని డైరెక్టర్ బలరాం చెప్పారు. మొత్తం 23 నెలల పెండింగ్ బకాయిలకు సంబంధించి రూ.1726 కోట్లను విడుదల చేస్తామన్నారు. ఒక్కో కార్మికుడు సుమారు రూ.4 లక్షల వరకు పొందే అవకాశం ఉందని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలను చెల్లించడం సింగరేణి చరిత్రలోనే తొలిసారి అని చెప్పారు.





నెల రోజుల వ్యవధిలో రెండు విడతలుగా ఈ బకాయిలను కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని డైరెక్టర్ బలరాం తెలిపారు. ఈ క్రమంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అన్ని విభాగాల సమన్వయంతో వేతన బకాయిల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. బకాయిలను నెలరోజుల్లోపే చెల్లించాలని ప్రాథమికంగా అనుకుంటున్నప్పటికీ అంతకన్నా ముందే చెల్లించేందుకు కృషి చేస్తున్నట్టు బలరామ్‌ తెలిపారు.





దసరా బోనస్ రూ. 1000 కోట్లు

మరోవైపు సింగరేణి కార్మికులకు దసరా - దీపావళి బోనస్‌గా రూ.1000 కోట్ల బోనస్ ఇస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. పోయిన దసరా పండుగకు కేవలం రూ.368 కోట్ల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం రూ. 1000 కోట్లు ప్రకటించింది. గత ప్రభుత్వాలు నష్టాల్లోకి నెట్టిన సింగరేణి కాలరీస్‌ను బీఆర్ఎస్ లాభాల్లోకి తీసుకొచ్చిందన్నారు. కంపెనీ టర్నోవర్‌ను రూ.12 వేల కోట్ల నుంచి రూ.33 వేల కోట్లకు పెంచినట్లు సీఎం వివరించారు.






Updated : 2 Sept 2023 3:27 PM IST
Tags:    
Next Story
Share it
Top