Home > తెలంగాణ > ముగిసిన సింగరేణి ఎన్నికల పోలింగ్.. 7 గంటలకు కౌంటింగ్ స్టార్ట్..

ముగిసిన సింగరేణి ఎన్నికల పోలింగ్.. 7 గంటలకు కౌంటింగ్ స్టార్ట్..

ముగిసిన సింగరేణి ఎన్నికల పోలింగ్.. 7 గంటలకు కౌంటింగ్ స్టార్ట్..
X

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 5గంటల వరకు కొనసాగింది. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో 93 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 7 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. శ్రీరాంపూర్, రామగుండం, కొత్తగూడెం, భూపాలపల్లి సెంటర్లలో కౌంటింగ్ జరగనుంది. తొలుత ఇల్లందు, చివరన శ్రీరాంపూర్ ఏరియా ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పోలిసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో నిలవగా.. ప్రధానంగా సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్​టీయూసీ మధ్యే ప్రధాని పోటీ నెలకొంది. గెలుపుపై రెండు సంఘాలు ధీమాగా ఉన్నాయి.


Updated : 27 Dec 2023 5:47 PM IST
Tags:    
Next Story
Share it
Top