Home > తెలంగాణ > బీఆర్ఎస్లో చేరిన ఏపూరి సోమన్న.. పాట గురించి ఏమన్నాడంటే..

బీఆర్ఎస్లో చేరిన ఏపూరి సోమన్న.. పాట గురించి ఏమన్నాడంటే..

బీఆర్ఎస్లో చేరిన ఏపూరి సోమన్న.. పాట గురించి ఏమన్నాడంటే..
X

ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సోమన్న.. ఏ పార్టీ అయినా ఏ జెండా అయినా ప్రజల ఎజెండానే తనకు ముఖ్యమని అన్నారు. అదే తన లక్ష్యమని అన్నారు. తెలంగాణ భవన్‌లో అడుగు పెట్టక పదేండ్లు దాటిందన్న ఆయన.. ఎవరి పాలైందిరో తెలంగాణ పాటపై క్లారిటీ ఇచ్చారు.

పదేళ్లు అవుతున్నా తెలంగాణలో కేసీఆర్కు ఆల్టర్నేటివ్ వస్తుందని పొరపాటు పడ్డానని, అయితే ప్రత్యామ్నాయం రాకపోగా.. తాను పాడిన పాట కొందరికి ఎంటర్టైన్మెంట్ అయిందని అన్నారు.స్వరాష్ట్రం వచ్చే ముందు తెలంగాణ భవన్‌కు దూరమయ్యానని ఇప్పుడు మళ్లీ సొంతింటికి తిరిగి వచ్చినట్లుందని చెప్పారు. పాట రోడ్ల మీద ఉండొద్దు చట్ట సభల్లో ఉండాలని ముఖ్యమంత్రి భావించారని అన్నారు.‘ఎవరి పాలైందిరో అంటే బరాబార్ కేసీఆర్ పాలైందని.. కేసీఆర్ పాలే కావాలని అంటానని ఏపూరి అభిప్రాయపడ్డారు. 25 ఏండ్లు కష్టపడితే ఈ భవన్ మెట్లు ఎక్కి పెద్దల పక్కన కూర్చున్నానని చెప్పారు. బీఆర్ఎస్‌కు కట్టుబడి పని చేస్తానని, కేసీఆర్ దారిలో నడుస్తామని, కాలికి మళ్లీ గజ్జె కట్టి.. కేసీఆర్ పాట పాడుతూ.. అభివృద్ధి పాట పాడుతానని సోమన్న స్పష్టం చేశారు.

అంతకు ముందు మాట్లాడిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హంతక రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీలో లేవని అన్నారు. సోమన్న ఓ పార్టీలోకి వెళ్తే చెట్టు ఎక్కించి చేతులు ఇరిసినట్లు వాళ్ల దారి వాళ్లు చూసుకున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌ను సోమన్న కలిస్తే ఏదో జరిగిపోయిందన్నట్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు హరీష్ రావు, కేటీఆర్, కవిత వేరే పనుల్లో బిజీగా ఉండటంతో సోమన్న చేరిక కార్యక్రామానికి రాలేకపోయారని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ అన్నారు.

Updated : 24 Sept 2023 10:10 PM IST
Tags:    
Next Story
Share it
Top