Home > తెలంగాణ > పాపికొండలు తలదన్నేలా సిరిసిల్ల అభివృద్ధి..కేటీఆర్‌

పాపికొండలు తలదన్నేలా సిరిసిల్ల అభివృద్ధి..కేటీఆర్‌

పాపికొండలు తలదన్నేలా సిరిసిల్ల అభివృద్ధి..కేటీఆర్‌
X

పాపికొండలు, కోనసీమను తలదన్నేలా సిరిసిల్ల అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ సర్కార్ అన్ని వర్గాలకు చెందిన ప్రజలను తన కడుపులో పెట్టుకుని చూసుకుంటోదని తెలిపారు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మినిస్టర్ అనంతరం రూ.3.16 కోట్లతో నిర్మించిన మధ్యమానేరు జలాశయంలో బోటింగ్ యూనిట్‎ను స్టార్ట్ చేశారు. జలాశయంలో స్వయంగా బోటును నడిపి కేటీఆర్ కాసేపు సందడి చేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిరిసిల్లలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రి మాట్లాడారు.

"గతంలో సిరిసిల్లకు వస్తే చుక్కనీరు కనిపించక పోయేది. కానీ నేడు పాపికొండలు, కోనసీమలను తలదన్నేలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. మధ్యమానేరు జలాశయంలో మత్స్య సంపదను పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సిరిసిల్లను మెచ్చుకొంటుంటే నా గుండె ఆనందంతో నిండిపోతుంది. ధనికులైన టాటాలు, బిర్లాలే కాదు..ఏళ్లనాటి కులవృత్తులు కూడా బతకాలన్నది సీఎం కేసీఆర్ విజన్. సిరిసిల్లలోనే కాదు జిల్లాలోని మండల కేంద్రాల్లోనూ నీరా కేఫ్‌లు ఏర్పాటు చేయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కోరుతున్నా. నీరా సేకరించే సమయంలో గీత కార్మికులు గాయపడకుండా ఉండేందుకు సేఫ్టీ మోకులు త్వరలో అందజేస్తాం"అని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Sirisilla has developed like Papikondalu and Konaseema says Minister KTR

Sirisilla, development, Papikondalu, Konaseema , Minister, KTR, srinivas goud, nera cafe, boating, boat, KTR boat drive, telangana news, Telangana, telugu news, KCR, CM, Chief Minister, sarvai papanna, statue inaguration, madhyamaneru , boating unit

Updated : 18 Aug 2023 1:55 PM GMT
Tags:    
Next Story
Share it
Top