Home > తెలంగాణ > ఫైనాన్స్ కమిషన్ ఛైర్శన్‌గా రాజయ్య నియమాకం

ఫైనాన్స్ కమిషన్ ఛైర్శన్‌గా రాజయ్య నియమాకం

ఫైనాన్స్ కమిషన్ ఛైర్శన్‌గా రాజయ్య నియమాకం
X

తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా వరంగల్ మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా సుంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహు నాయక్ మాలోత్, ఎం. రమేశ్‌ను నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. వీరంతా రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. సిరిసిల్ల రాజయ్య వరంగల్‌ (ఎస్‌సీ) పార్లమెంట్‌ స్థానం నుంచి 15వ లోక్‌సభకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. రాజయ్య 2009 లో వరంగల్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇప్పటికే స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ సెక్రటరీగా సీఎంవో మాజీ కార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు రాజయ్య. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కడియం… 3,92,574 ఓట్ల తేాడాతో భారీ విజయాన్ని సాధించారు. మరోవైపు సిరిసిల్ల రాజయ్య కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. ఆయన కోడలు ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయ్యారు. 2015లో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో ఆయనపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కోడలి ఆత్మహత్య కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం 2022 మార్చిలో రాజయ్య కుటుంబాన్ని నిర్దోషిగా తేల్చింది. తిరిగి సొంత గూటికి చేరుకున్న రాజయ్య… పార్టీలో క్రియాశీలకంగా మారారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటును ఆశించారు. అయితే ప్రస్తుతం ఆయన్ను ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ గా నియమించటంతో ఆయన పోటీ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Updated : 16 Feb 2024 2:12 PM GMT
Tags:    
Next Story
Share it
Top