Home > తెలంగాణ > అన్న మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు

అన్న మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు

అన్న మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు
X

తోడబుట్టిన అన్నాదమ్ముళ్లతో తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కాచెల్లెళ్లు కోరుకునే పవిత్రమైన రాఖీ పండుగ నాడే ఓ చెల్లెలు.. తన అన్నకు తుది వీడ్కోలు పలకాల్సి వచ్చింది. అందరిలానే ఆ చెల్లెలు కూడా తన అన్నకు రాఖీ కట్టేందుకు ఆనందంగా తన పుట్టింటికి వెళ్లింది. అయితే అత్యంత విషాదకర రీతిలో మృతదేహానికి రాఖీ కట్టాల్సి వచ్చింది. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన అన్నకు.. చివరిసారిగా రాఖీ కట్టి గుండెలవిసేలా రోదించింది. ఈ హృదయ విదారక ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టకు చెందిన చౌదరి కనకయ్యకు రాఖీ కట్టేందుకు చెల్లె గౌరమ్మ ఇంటికి వచ్చింది. అప్పటిదాకా చెల్లెతో సంతోషంగా గడిపిన కనకయ్య ఒక్కసారిగా గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆపై క్షణాల వ్యవధిలో కన్నకయ్య ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో సంతోషంగా తన అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లికి అంతులేని విషాదం మిగిలింది. సోదరుడి మృతదేహానికి చివరిసారిగా రాఖీ కట్టి తన పేగుబంధాన్ని చాటుకుంది. ఇదే నా అన్నకు నేను కట్టే చివరి రాఖీ.. వచ్చే ఏడాది నుంచి రాఖీ కట్టేందుకు నా అన్న ఉండడు అంటూ గుండెలవిసేలా విలపించింది. చెల్లెలు గౌరమ్మ రోదన చూసిన వాళ్లందరినీ దుఃఖ సాగరంలో ముంచేసింది.ఇద్దరి మధ్య ఉన్న అనురాగాన్ని చూసినవారంతా కన్నీటి పర్యంతమయ్యారు.

Updated : 30 Aug 2023 1:16 PM IST
Tags:    
Next Story
Share it
Top