Home > తెలంగాణ > మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై ఆరుగురు నిపుణులతో కమిటీ

మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై ఆరుగురు నిపుణులతో కమిటీ

మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై ఆరుగురు నిపుణులతో కమిటీ
X

మేడిగడ్డ బ్యారేజీ కుంగడాన్ని కేంద్ర జలశక్తి శాఖ సీరియస్గా తీసుకుంది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ హైదరాబాద్‌లో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సంస్థ, రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనుంది. ఆ తర్వాత మేడిగడ్డ జలాశయాన్ని సందర్శించి కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందించనుంది.

శనివారం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ బ్రిడ్జి ఒక్కసారిగా కొంతమేరకు కుంగింది. బి బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన భారీ శబ్దంతో ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగడంతోనే వంతెన కుంగినట్లు సమాచారం. ఈ వంతెన పొడవు 1.6 కిలోమీటర్ల కాగా.. కుంగిపోయిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది.




Updated : 23 Oct 2023 11:27 AM GMT
Tags:    
Next Story
Share it
Top