Home > తెలంగాణ > ఆ వ్యక్తి చేసిన పనికి పరుగులు తీసిన రైలు ప్రయాణికులు

ఆ వ్యక్తి చేసిన పనికి పరుగులు తీసిన రైలు ప్రయాణికులు

ఆ వ్యక్తి చేసిన పనికి పరుగులు తీసిన రైలు ప్రయాణికులు
X

ఇటీవల కాలంలో వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. జులైలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగగా.. తాజా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో పొగలు వ్యాపించాయి. దీంతో రైలును నిలిపివేయగా.. ప్రయాణికులు భయంతో పరగులు తీశారు. హైదరాబాద్ నుంచి హౌరా వెళ్తుండగా మహబూబ్ నగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బ్రేక్‌లైన్‌ పట్టేయడంతో పొగలు వచ్చినట్లుగా తెలుస్తోంది.

రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేశారు. దాదాపు అరగంట తర్వాత రైలు బయలుదేరింది. పొగలు రావడానికి ఒక ప్రయాణికుడు చేసిన పనే కారణమని సమాచారం. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు ట్రైన్ చైన్ లాగి వదిలేశాడు. దీంతో కొద్దిదూరం వెళ్లిన తర్వాత బ్రేకులు పట్టేయడంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. చైన్ లాగిన ప్రయాణికుడు ఎవరనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Updated : 6 Sept 2023 8:31 PM IST
Tags:    
Next Story
Share it
Top