Home > తెలంగాణ > మరో వివాదంలో పైలెట్ రోహిత్ రెడ్డి.. కేజీఎఫ్ స్టైల్లో ఫోజులిచ్చి..

మరో వివాదంలో పైలెట్ రోహిత్ రెడ్డి.. కేజీఎఫ్ స్టైల్లో ఫోజులిచ్చి..

మరో వివాదంలో పైలెట్ రోహిత్ రెడ్డి.. కేజీఎఫ్ స్టైల్లో ఫోజులిచ్చి..
X

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తనకు కేటాయించిన భద్రతా సిబ్బందితో రోహిత్ రెడ్డి ఇన్ స్టా రీల్స్ తీయడం దూమారం రేపింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న రోహిత్ రెడ్డికి తెలంగాణ సర్కారు ఇటీవలే భద్రత పెంచింది. ఆయనకు వై కేటగిరి సెక్యూరిటీ కల్పించింది. అయితే రోహిత్ రెడ్డి తనకు కేటాయించిన సెక్యూరిటీతో ఫొటో షూట్ చేయటం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.

మూడు రోజులుగా అతిరుద్ర మహా యాగం నిర్వహిస్తున్న పైలెట్ రోహిత్ రెడ్డి తన గన్‌మెన్‌లు, వై.సెక్యురిటీ సిబ్బందితో వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్‌ మారాయి. ఈ వీడియోలో రోహిత్ రెడ్డి కాషాయ వస్త్రాలు ధరించి నడుచుకుంటూ వస్తుండగా.. ఆయన వెనక సెక్యూరిటీ సిబ్బంది ఒక్కొక్కరుగా వస్తుంటారు. బ్యాగ్రౌండ్‌లో మ్యూజిక్ ప్లే అవుతుంది. ఇలా రెండు వైపులా సెక్యూరిటీ సిబ్బంది నడుస్తుండగా.. మధ్యలో రోహిత్ రెడ్డి నడుచుంటూ వస్తున్న వీడియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసమేనా ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది అంటూ ఫైర్ అవుతున్నారు.


Updated : 13 July 2023 10:10 PM IST
Tags:    
Next Story
Share it
Top