హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్.. 24 గంటల్లోనే..
Krishna | 5 Jan 2024 6:05 PM IST
X
X
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం గుర్రం సురేందర్ అనే వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత బాధితుడి భార్యకు ఇంటర్నెట్ ద్వారా కాల్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇవాళ అతడు ఉన్న ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. ఆర్థిక లావాదేవీలే అతడి కిడ్నాప్కు కారణమని తెలుస్తోంది. సురేందర్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నిన్న సైబరాబాద్ కమిషనరేట్ ఆఫీస్ పక్కన ఉన్న కేర్ హాస్పిటల్ వద్ద ఉండగా.. గుర్తుతెలియని దుండగులు కారులో వచ్చి అపహరించారు. కేవలం 24 గంటల్లోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
Updated : 5 Jan 2024 6:05 PM IST
Tags: hyderabad kidnap software employee software employee kidnap gachibowli hyderabad police telangana police kukatpally raidurgam police telangana news telangana updates
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire