Home > తెలంగాణ > దొంగల దుశ్చర్య.. ట్రైన్ నుంచి కిందపడి టెక్కీ మృతి

దొంగల దుశ్చర్య.. ట్రైన్ నుంచి కిందపడి టెక్కీ మృతి

దొంగల దుశ్చర్య.. ట్రైన్ నుంచి కిందపడి టెక్కీ మృతి
X

ఏ క్షణంలో ఎవరి ప్రాణాలు ఎలా పోతాయనేది ఎవరూ ఊహించలేరు. పండుగ రోజని, సరదాగా కుటుంబ సభ్యులతో గడుపుదామని నగరం నుంచి సొంతూరికి బయల్దేరిన ఓ టెకీ అర్థాంతరంగా చనిపోయాడు. సెల్‌ఫోన్‌ను రక్షించుకోవాలనే తాపత్రయంతో రన్నింగ్‌ ట్రైన్‌ నుంచి పడి ప్రాణం కోల్పోయాడా యువకుడు. శాతావాహన్‌ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం బీబీనగర్‌(యాదాద్రి భువనగిరి) సమీపంలో ఈ విషాదం జరిగింది.

హన్మకొండ జిల్లా కమలాపూర్ ​మండలంలోని నేరెళ్లకు చెందిన ముప్పు రాములు, ధనమ్మ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కొడుకు శ్రీకాంత్ ఉన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీకాంత్.. కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేసి హైదరాబాద్​ ఇన్పోసిస్ ​లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా జాబ్ సంపాదించాడు. నగరంలో స్నేహితులతో ఉంటూ జాబ్ చేస్తున్న అతడు.. తొలి ఏకాదశి పండుగ కోసం సికింద్రాబాద్ ​నుంచి​ శాతవాహన ఎక్స్ ప్రెస్ లో ఖాజీపేటకు బయలు దేరి వెళ్లాడు. ట్రైన్ లో రష్ ​ఎక్కువగా ఉండడంతో డోర్​ దగ్గర మెట్లపై కూర్చొని ఫోన్​ చూస్తున్నాడు. బీబీనగర్ ​రైల్వేస్టేషన్ ​దాటిన తర్వాత కింద ఉన్న కొందరు అతడి చేతిపై కర్రతో కొట్టి.. సెల్ ఫోన్ దొంగిలించేందుకు ప్రయత్నించారు. దీంతో కింద పడబోతున్న ఫోన్ ​ను పట్టుకోబోయిన శ్రీకాంత్​ రైలులో నుంచి కిందకు జారీపడి తీవ్ర గాయాలతో చనిపోయాడు. దీంతో కమలాపూర్ మండలం నేరెళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పండుగకు ఇంటికి కొడుకు వస్తాడని సంతోషంగా ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులకు.. కొడుకు శవం ఎదురు రావడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Updated : 29 Jun 2023 8:27 AM GMT
Tags:    
Next Story
Share it
Top