ప్రేమ జంట కులాంతర వివాహం...అల్లుడికి గుండు
X
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న ప్రేమజంటపై యువతి కుటుంబీకులు కక్ష గట్టారు. ఏడాది తర్వాత నమ్మకంతో అల్లుడిని ఇంటికి రప్పించి దాడి చేశారు. అంతటితో ఆగకుండా అతనికి గుండుకొట్టించారు. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఇందల్‌వాయి మండలం ఆన్సన్‌పల్లి చెందిన నందు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించుకున్నారు. ఇద్దరు కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వారు పెద్దలను ఎదిరించి ఏడాది కిందట వివాహం చేసుకున్నారు. ఇటీవల యువతి తన కుటుంబ సభ్యులతో కలిసింది. ఇరువరు బాగానే మాట్లాడుకుంటున్నారు. దీంతో గొడవ సద్దుమణిగిందని అంతా భావించారు. ఈ క్రమంలో యువతిని ఇంటికి పుట్టింటికి రమ్మని పిలిచారు. ఆమె వెళ్లగా, తరువాత అల్లుడికి కబురుపంపారు. నమ్మకంతో అక్కడికి వెళ్లని నందుకు ఊహించని పరిణామం ఎదురైంది.
ఇంట్లో దొంగతనం చేశాడనే పేరుతో నందును అత్తింటి వారు చావాబాదారు. గుండు కొట్టించి దాడి చేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరు నందుపై కొట్టారు. ఇదంతా ఆ గ్రామ సర్పంచి కళ్లెదుటే జరగడం విశేషం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నందును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.