Home > తెలంగాణ > Sonia gandhi : తెలంగాణ నుంచి లోక్సభ బరిలో సోనియా.. పోటీ ఎక్కడనుంచంటే..?

Sonia gandhi : తెలంగాణ నుంచి లోక్సభ బరిలో సోనియా.. పోటీ ఎక్కడనుంచంటే..?

Sonia gandhi : తెలంగాణ నుంచి లోక్సభ బరిలో సోనియా.. పోటీ ఎక్కడనుంచంటే..?
X

లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి పార్టీ సీనియర్ నేత సోనియాగాంధీ పోటీకి దిగనున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలంటూ కొంతకాలంగా రాష్ట్ర నాయకత్వం కోరుతోంది. ఈ మేరకు గత నెలలో తీర్మానం చేసి హైకమాండ్కు పంపింది. ఈ క్రమంలో సోనియా అప్పట్లో సూత్రప్రాయంగా అంగీకారం తెలపగా.. తాజాగా తెలంగాణ నుంచి పోటీపై క్లారిటీకి వచ్చినట్లు సమాచారం.

లోక్ సభ ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనుండగా.. ఈసారి సోనియా గాంధీ ఖమ్మం ఎంపీ స్థానం నుంచి బరిలో దిగుతారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని కీలక నాయకులకు హైకమాండ్ ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సోనియా ఖమ్మం నుంచి పోటీ చేస్తే తెలంగాణతో పాటు ఏపీ, కర్నాటక రాష్ట్రాల్లోనూ సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో సోనియా గెలుపు బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొత్తగా పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు అప్పగించినట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

రాష్ట్రం నుంచి పోటీ చేయడానికి సోనియా అంగీకరించారని, అందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించడంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిమగ్నమైంది. సోనియా పోటీ కోసం పలు లోక్‌సభ స్థానాలను పరిశీలించినప్పటికీ చివరకు ఖమ్మం నుంచి రంగంలోకి దించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఇతర నియోజక వర్గాలతో పోలిస్తే అక్కడ కాంగ్రెస్‌ చాలా బలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అనంతరం సోనియా గాంధీ నేతృత్వంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నేతలు ప్లాన్ చేస్తున్నారు.

సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే దక్షిణాది నుంచి ఆమె పోటీ చేయడం ఇది రెండోసారి అవుతుంది. 1999లో కర్నాటకలోని బళ్లారి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన సోనియాగాంధీ బీజేపీ నేత సుష్మా స్వరాజ్‌పై విజయం సాధించారు. దాదాపు 25 తర్వాత మళ్లీ ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కర్నాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి లోక్సభకు పోటీ చేశారు. 1978లో కర్నాటకలోని చిక్‌మగళూరు, 1980లో ఉమ్మడి ఏపీలోని మెదక్‌ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.


Updated : 5 Jan 2024 7:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top