Home > తెలంగాణ > కాజీపేట-విజయవాడ రూట్‌లో పలు రైళ్ల రద్దు

కాజీపేట-విజయవాడ రూట్‌లో పలు రైళ్ల రద్దు

కాజీపేట-విజయవాడ రూట్‌లో పలు రైళ్ల రద్దు
X

కాజీపేట-వరంగల్ మార్గంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే విభాగం రద్దుచేసింది. మూడో లైన్ పనులు కొనసాగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నా మని రైల్వే అధికారులు సోమవారం తెలిపారు.

రద్దయిన రైళ్ల వివరాలు

కాజీపేట-విజయవాడ మధ్య నడిచే గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ, లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్ ప్రెస్ రైళ్లు ఈ నెల 10 నుంచి 18 వరకు రద్దు.

శాతవాహన ఎక్స్ ప్రెస్ ఈ నెల 7 వ తేదీ రద్దు. మళ్లీ 10 వ తేదీ నుంచి 18 వరకు రద్దు.

సికింద్రాబాద్, భద్రాచలం కాకతీయ ఎక్స్ ప్రెస్ ఈ నెల 6 వ తేదీన రద్దు. తర్వాత మళ్లీ ఈ నెల 10 నుంచి 18 వరకు రద్దు.

ఆదిలాబాద్- తిరుపతి కృష్ణా ఎక్స్ ప్రెస్ ఈ నెల 5 నుంచి 19వ తేదీ వరకు రద్దు.

కాజీపేట- డోర్నకల్, డోర్నకల్ - విజయవాడ మధ్య తిరిగే పుష్ ఫుల్ రైళ్లు ఈ నెల 10 వ తేదీ నుంచి 18 వరకు రద్దు.

గోల్కొండ ఎక్స్ ప్రెస్ ఈ నెల 11 నుంచి 19 వ తేదీ వరకు కాజీపేట వరకు మాత్రమే.

భద్రాచలం రోడ్ - బల్లార్షా సింగరేణి ఎక్స్ ప్రెస్ ఈ నెల 6 నుంచి 8 వరకు రద్దు. 10 నుంచి 19వ తేదీ వరకు హసన్ పర్తి రోడ్డు వరకు మాత్రమే.

Updated : 4 Dec 2023 2:55 PM IST
Tags:    
Next Story
Share it
Top