Home > తెలంగాణ > వర్షాల ఎఫెక్ట్.. 5 రైళ్లు రద్దు.. 40 దారి మళ్లింపు

వర్షాల ఎఫెక్ట్.. 5 రైళ్లు రద్దు.. 40 దారి మళ్లింపు

వర్షాల ఎఫెక్ట్.. 5 రైళ్లు రద్దు.. 40 దారి మళ్లింపు
X

భారీ వర్షాలు రైల్వే సర్వీసులపై ప్రభావం చూపాయి. పట్టాలతో పాటు రైల్వే స్టేషన్లలోకి వరద నీరు వస్తుండటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో 5 రైళ్లను పూర్తిగా 4 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. మరో 40 రైళ్లను దారి మళ్లించారు. పలు రైళ్లు గంటల తరబడి రైల్వే స్టేషన్లలోనే నిలిచిపోయాయి. గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ ను గురువారం మధ్యాహ్నం నుంచి 6 గంటల పాటు పెద్దపల్లి స్టేషన్ లో నిలిపేశారు. హనుమకొండ జిల్లా వడ్డేపల్లి వద్ద రైలు పట్టాల వరకు వరద నీరు వచ్చింది. కోమటిపల్లి రైల్వే గేటు వద్ద పట్టాల మీదుగా ప్రవాహం పారింది. హసన్‌పర్తి-కాజీపేట మధ్య వరదనీరు ప్రమాదకరస్థాయిలో ట్రాక్‌ పైనుంచి పొంగి పొర్లింది.

భారీ వరాషాల కారణంగా భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌, బీదర్‌ ఇంటర్‌సిటీని 28 తేదీన దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను బల్లార్ష నుంచి మంచిర్యాల, కాజీపేట వైపు కాకుండా మజ్రి, పింపల్‌కుట్టి మార్గంలో దారి మళ్లించారు. సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరిన దానాపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ని కాజీపేట నుంచి విజయవాడ, దువ్వాడ, విజయనగరం, సంబల్‌పుర్‌ మీదుగా మళ్లించి నడిపించారు. తిరువనంతపురం-దిల్లీ ఎక్స్‌ప్రెస్‌ని విజయవాడ నుంచి వరంగల్‌ వైపు కాకుండా దువ్వాడ, విజయనగరం, రాయగడ, రాయ్‌పుర్‌ నాగ్‌పుర్‌ వైపు మళ్లించారు. తిరుపతి-కరీంనగర్‌, కరీంనగర్‌-తిరుపతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట-కరీంనగర్‌, కరీంనగర్‌-వరంగల్‌ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. సికింద్రాబాద్‌-కాగజ్‌నగర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ సిర్పుర్‌ కాగజ్‌నగర్‌-ఘన్‌పుర్‌ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు. బెంగళూరు-దానాపుర్‌ స్పెషల్‌ ఫేర్‌, యశ్వంత్‌పుర్‌-గోరఖ్‌పుర్‌, అండమాన్‌ ఎక్స్‌ప్రెస్‌, రామేశ్వరం-బనారస్‌, శ్రీవైష్ణోదేవి కట్రా-చెన్నై, నిజాముద్దీన్‌-విశాఖ, దానాపూర్‌-సికింద్రాబాద్‌ దారి మళ్లించారు.

Updated : 28 July 2023 7:50 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top