దసరాకు ఊరెళ్తున్నారా?..వారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్
X
గణేశ్ నవరాత్ర ఉత్సవాలు పూర్తయ్యాయి. ఇక అసలైన పండుగలు ముందున్నాయి. అందులో దసరా, దీపావళి అందరికీ ఎంతో స్పెషల్. ఉద్యోగాలరిత్యా ఎక్కడెక్కడో ఉంటున్నవారంతా పండుగల సమయం సమీపిస్తుండటంతో తమ సొంతూళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో సంబురాలు జరుపుకోవాలని ఇప్పటి నుంచే ప్లాన్లు మొదలు పెట్టేశారు. ఆఫీసుల్లో లీవ్‌లకు అప్లై చేసి బస్సులు, రైళ్ల టికెట్లు బుక్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే.. మరో 15 రోజుల్లో దరసా పండుగా షురూ అవుతుండటంతో ఇప్పటికే చాలా వరకు రైళ్లు ఫుల్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పండుగల వేళ ప్రయాణికుల సౌకర్యార్థం, రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. అందులో భాగంగా తాజాగా స్పెషల్ ట్రైన్స్‌ను ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 13 వరకు పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.
అక్టోబర్ 5 నుంచి డిసెంబర్ 7 వరకు ప్రతి గురువారం దానాపూర్- సికింద్రాబాద్ (03225) ప్రత్యేక రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమ, మంగళవారాల్లో పాట్నా- సికింద్రాబాద్ (03253) ప్రత్యుక రైలు సేవలను అందిస్తుంది. అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 8 వరకు సికింద్రాబాద్- పాట్నా రైలు (07255) ప్రతి శుక్రవారం నడుస్తుంది. అక్టోబర్ 4 నుంచి డిసెంబర్ 6 వరకు ప్రతి బుధవారం హైదరాబాద్- పాట్నా(07255) రైలు, ఇక అక్టోబర్ 5 నుంచి డిసెంబర్ 7 వరకు సికింద్రాబాద్- దానాపూర్ (03226) రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29 వరకు ప్రతీ బుధవారం విశాఖపట్నం- సికింద్రాబాద్ (08579) స్పెషల్ ట్రైన్ నడువనుంది. రాత్రి 7 గంటలకు విశాఖలో స్టార్ట్ అయ్యి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇక అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 వరకు సికింద్రాబాద్- విశాఖ(08580) రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.