వాతావరణం అప్డేట్: రానున్న 48 గంటల్లో రుతుపవనాలు.. IMD అంచనా
X
నైరుతి రుతుపవనాలపై ఈసారి వాతావరన ప్రభావం పడింది. దీంతో దేశంలోకి ఈసారి రుతుపవనాలు ఇంకా ప్రవేశించలేదు. అయితే సౌతీస్ట్ అరేబియన్ సీలో ఏర్పడిన బిపోర్ జాయ్ తుఫాన్ వల్ల నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వస్తాయని అంచనాలు వేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన భారత వాతావరణ శాఖ.. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందంటూ ప్రకటిచింది. గతేడాది జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఈ ఏడాది అవి శ్రీలంక తీరాన్ని కూడా దాటలేదు.
వాతావరణంలో మార్పుల వల్ల రుతు పవనాల రాకలో ఆలస్యం అవుతోంది. మొదట జూన్ 4 న రుతుపవనాలు తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పినా.. జూన్ 7 వచ్చినా వాటి ఆచూకీ కనిపించలేదు. ఇప్పుడు బిపోర్ జాయ్ తుఫాన్ ప్రభావం వల్ల అరేబియా సముద్రంలో రుతుపవనాలు కదలికలు బలహీనంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో దేశంలోరి కొన్ని ప్రాంతాల్లో వానాకాలంలో వర్షాపాతం ఐదు శాతం తగ్గొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.