పాస్పోర్ట్ ఆఫీసులకు సెలవు.. అపాయింట్మెంట్లన్నీ క్యాన్సిల్
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న జరుగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. అందులో భాగంగానే.. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసులు కూడా మూసేయనున్నారు. ఆ విషయాన్ని ఆర్పీవో దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే నవంబర్ 30న అపాయింట్మెంట్ కోసం బుక్ చేసుకున్న అప్లికెంట్లకు నవంబర్ 18కి రీషెడ్యూల్ చేశామని తెలిపారు. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే వారం విడుదల చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట, బేగంపేట, టోలీచౌకి పీఎస్‌కేలతోపాటు మరో ఐదు పీఎస్కేలు.. కరీంనగర్, నిజామాబాద్‌లో ఒక్కొక్కటి, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌లో మూడు పీఓఎస్కేలు మూతపడనున్నాయి. నవంబర్ 30న అపాయిట్మెంట్ క్యాన్సిల్ అయిన అప్లికెంట్ల కోసం ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటుచేస్తామని అధికారులు చెప్పుకొచ్చారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.