Home > తెలంగాణ > Old city Bangles : పాతబస్తీ లక్క గాజులకు అరుదైన గుర్తింపు

Old city Bangles : పాతబస్తీ లక్క గాజులకు అరుదైన గుర్తింపు

Old city Bangles : పాతబస్తీ లక్క గాజులకు అరుదైన గుర్తింపు
X

భాగ్యనగరానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. నగరంలోని ఓల్డ్ సిటీ లక్క గాజులకు ప్రత్యేక గుర్తింపు లభించింది.ఇది వరకే హైదరాబాద్‌ హలీమ్‌కు జీఐ ట్యాగ్‌ దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో లక్క గాజులు చేరాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్‌ లాడ్‌బజార్‌ లాక్‌ గాజులను తెలుగులో లక్క రాళ్ల గాజులు అంటుంటారు. హైదరాబాద్‌లోని లాడ్‌బజార్ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ అధీనంలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ గుర్తింపును మంజురు చేసింది.





తెలంగాణ నుంచి జీఐ ట్యాగ్ కోసం 2022లో హ్యాండీక్రాప్ట్స్ వెల్ఫేర్ అప్లేయ్ చేసింది.హైదరాబాద్‌ పాతబస్తీ అంటేనే గాజులకు ప్రసిద్ధి. ఇక్కడ రకరకాల గాజులు తయారవుతుంటాయి. అందులో లక్క రాళ్ల గాజులు స్థానిక, అంతర్జాతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందాయి. ఈ గాజుల తయారీ అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. రెసిన్‌ను కొలిమిపై కరిగిస్తే లక్క వస్తుంది. దీన్ని వృత్తాకారంలో మలిచి.. దానిపై స్ఫటికాలు, రాళ్లు, పూసలు, అద్దాలను హస్తకళాకారులు చేతులతోనే అందంగా పొదుగుతారు. అయితే కాలక్రమంలో వీటి డిజైన్లలో ఎన్నో మార్పులొచ్చాయి. మొగలుల కాలంలో ఈ కళ ప్రారంభమైందని స్థానికులు చెబుతారు. అందుకు తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ సహకారాలు అందించింది. 18 నెలల పరిశీలన అనంతరం గాజులకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ జీఐ ట్యాగ్‌ మంజూరైంది. త్వరలోనే అందుకు సంబంధించిన సర్టిఫికేట్ రానుంది.




Updated : 3 March 2024 7:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top