Home > తెలంగాణ > నేటి నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు

నేటి నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు

నేటి నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు
X

నేటి నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాలు పాత భవనంలో మొదలై మంగళవారం గణేశ్‌ చతుర్ధి సందర్భంగా కొత్త భవనంలోకి మారనున్నాయి. నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే తొలిరోజు సమావేశంలో పార్లమెంట్‌లో 75 ఏళ్ల ప్రయాణంపై చర్చతో పాటు పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి.

రేపటి నుంచి కొత్త భవనంలో సమావేశాల జరుగనున్న నేపథ్యంలో.. నేడు పార్లమెంట్ ప్రస్థానం, అనుభవాలు, విజయాలు, జ్ఞాపకాలు, పాఠాలు అనే అంశంపై చర్చిస్తారు. తద్వారా పాత పార్లమెంట్‌లో ఎలాంటి సమావేశాలు జరిగాయో, చరిత్రాత్మక ఘట్టాలు ఏవేవి జరిగాయో చర్చిస్తారు.

బిల్లుల విషయానికొస్తే, ఈ సంవత్సరం ఆగస్టు 3న వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ ఆమోదం పొందిన అడ్వకేట్ల సవరణ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ బిల్లు 2023 లోక్‌సభ ముందుకు వస్తాయి. అలాగే పోస్ట్ ఆఫీస్ బిల్లు 2023, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు 2023పై చర్చ జరుగుతుంది. మరోవైపు సభలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రాంతీయ పార్టీలు డిమాండు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లులను ప్రవేశపెట్టి, వాటికి ఆమోదం తెలపాలని బిజు జనతాదళ్‌ (BJD), భారత్‌ రాష్ట్ర సమితి (BRS) పట్టుబడుతున్నాయి.




Updated : 18 Sep 2023 2:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top