Home > తెలంగాణ > విద్యుత్ కోతలపై దుష్ప్రచారం చేసే వారిని వదిలి పెట్టొద్దు : Bhatti Vikramarka

విద్యుత్ కోతలపై దుష్ప్రచారం చేసే వారిని వదిలి పెట్టొద్దు : Bhatti Vikramarka

విద్యుత్ కోతలపై దుష్ప్రచారం చేసే వారిని వదిలి పెట్టొద్దు : Bhatti Vikramarka
X

కరెంట్ కోతలంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. తమ ప్రాంతంలో విద్యుత్ కోతలు విధిస్తున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తాము క్షేత్ర స్ధాయిలో పరిశీలిస్తే తప్పుడు ప్రచారమని తెలిందని విద్యుత్ అధికారులు భట్టి దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని డీప్యూటి సీఎం తెలిపారు. వ్యవసాయ రంగానికి కరెంటు కోతలు విధించడం పట్ల సర్కారు సీరియస్‌ అయింది. విద్యుత్‌ సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో నల్లగొండ ఎస్‌ఈ చంద్రమోహన్‌, మిర్యాలగూడ డీఈ వెంకటేశ్వర్లుకు విద్యుత్‌ శాఖ చార్జ్‌ మెమో ఇచ్చింది.

మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలోని త్రిపురారం మండలంలో కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయని ఆ ప్రాంత రైతులు ఈ నెల 15న రాత్రి సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ ఘటన అనంతరం ముకుందాపురం ఫీడర్‌ పరిధిలోని నిడమనూరు, త్రిపురారం మండలాల్లో కరెంటు కోతలపై రైతులు పలుమార్లు నిరసనలు చేశారు. ఈ ఆందోళనలను సీరియస్‌గా తీసుకున్న డిప్యుటీ సీఎం, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క విచారణకు ఆదేశించారు. వారం రోజుల్లో మరో రెండు గ్యారెంటీలను అమలుచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Updated : 22 Feb 2024 7:45 AM IST
Tags:    
Next Story
Share it
Top