అమరవీరుడు శ్రీకాంత చారి తల్లికి ఎమ్మెల్సీ పదవి..?
X
తెలంగాణ మలిదశ పోరాట తొలి అమరుడు శ్రీకాంతా చారి కుటుంబానికి గౌరవం దక్కనుంది. అమరవీరుల కుటుంబాన్ని అండగా ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ మరోసారి చాటి చెప్పారు. శ్రీకాంత్ చారి తల్లి కాసోజు శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు శంకరమ్మకు సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజు జూన్ 22 న ట్యాంక్‌బండ్‌పై నిర్మించిన అమరవీరుల స్మారక చిహాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. తర్వాత భారీ బహిరంగ సభ లో పాల్గొంటారు. ఈ సభలోనే అమరవీరుడు అయిన శ్రీకాంతాచారి తల్లికి పదవిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా శంకరమ్మకు ఓ పీఏ, గన్ మెన్‌గా ఓ కానిస్టేబుల్‌తో పాటు ఆమెకు ప్రభుత్వ వెహికల్ కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. గురువారం నుండి పూర్తిగా అందుబాటులో ఉండాలని ఆమెకు అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.