Home > తెలంగాణ > ఆటో డ్రైవర్లకు రూ.12వేలు.. వచ్చే బడ్జెట్లో అమలు: మంత్రి శ్రీధర్ బాబు

ఆటో డ్రైవర్లకు రూ.12వేలు.. వచ్చే బడ్జెట్లో అమలు: మంత్రి శ్రీధర్ బాబు

ఆటో డ్రైవర్లకు రూ.12వేలు.. వచ్చే బడ్జెట్లో అమలు: మంత్రి శ్రీధర్ బాబు
X

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆటోడ్రైవర్లు నష్టపోతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏడాదికి రూ.12వేలు భరోసా అందిస్తామని చెప్పారు. వచ్చే బడ్జెట్ లో ఈ హామీని తప్పక అమలు చేస్తామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానంగా శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు.

ప్రతిపక్ష నేతలు రాజకీయాలు వదిలి.. రాష్ట్ర ప్రగతికి తోర్పడాలని కోరారు. తెలంగాణ అభివృద్ధికి ఏవైనా సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి ఎల్లప్పుడూ కొనసాగుతుందని, ఆర్థిక ప్రగతిపై ఎలాంటి భేషజాలు లేవని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.




Updated : 9 Feb 2024 6:25 PM IST
Tags:    
Next Story
Share it
Top