Home > తెలంగాణ > టికెట్ రాలేదని వెక్కి వెక్కిన ఏడ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

టికెట్ రాలేదని వెక్కి వెక్కిన ఏడ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

టికెట్ రాలేదని వెక్కి వెక్కిన ఏడ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
X

బీఆర్ఎస్లో టికెట్ల మంటలు ఇంకా చల్లారడం లేదు. గులాబీ బాస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. టికెట్లు రాని నేతలంతా తమ అసంతృప్తిని ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్యే రేఖానాయక్ వంటి నేతలు పక్క పార్టీలవైపు చూస్తుండగా.. మరికొందరు కేసీఆర్ వెంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య టికెట్ రాకపోవడంతో భావోద్వేగానికి లోనయ్యారు. అభిమానులను పట్టుకుని ఏడ్చారు. అందరూ ఓపికతో ఉండాలని కార్యకర్తలకు సూచించారు.

టికెట్ రాకపోయినా కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని రాజయ్య స్పష్టం చేశారు. ‘‘2001 నుంచి కేసీఆర్ను ఒక్క మాట అనలేదు. 2011లో కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరాను. అప్పటినుంచి కేసీఆర్‌కు వీర విధేయుడిగా ఉన్నా. డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించినా పార్టీని వీడలేదు. ఉన్నత స్థానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. అనునిత్యం ఘన్ పూర్ ప్రజల వెంటే ఉంటా. చావైనా బతుకైనా ప్రజలతోనే’’ అని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంపై రాజయ్య సతీమణి ఫాతిమా మేరీ సైతం స్పందించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ తమకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి కడియంకు మద్ధతుగా ప్రచారం చేస్తామని చెప్పారు. కాగా స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ రాజయ్యకు కాకుండా కడియం శ్రీహరికి ఇచ్చారు. దీంతో టికెట్ పై గంపెడాశలు పెట్టుకున్న రాజయ్యకు నిరాశే ఎదురైంది.



Updated : 22 Aug 2023 7:20 PM IST
Tags:    
Next Story
Share it
Top