హైదరాబాద్‌కు మరో మణిహారం.. ఓపెనింగ్‌కు స్టీల్ బ్రిడ్జి రెడీ..!!
X
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డా.బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహం, ఆకట్టుకునే రాష్ట్ర సచివాలయ నిర్మాణం, ఆ పక్కనే అమరువీరుల స్మారక జ్యోతి.. హైదరాబాద్ నగరానికి మణిహారాలుగా ఉన్నాయి. తాజాగా వాటి జాబితాలో మరో నిర్మాణం చేరబోతుంది. అదే ఉక్కు వంతెన. సాధారణ బ్రిడ్జిల కంటే భిన్నంగా ఉండే ఆ ఉక్కు వంతెన దక్షిణ భారతదేశంలోనే మొదటి పొడవైన స్టీల్ బ్రిడ్జ్‌గా నిలవనుంది. తెలంగాణ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌డిపి) కింద జిహెచ్‌ఎంసి 450 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఫ్లైఓవర్(బ్రిడ్జి)ను నిర్మించింది.
ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా రాజధాని నడిబొడ్డున నిర్మించిన ఉక్కు వంతెన. మెట్రోపై నుంచి ఉండటం మరో ప్రత్యేకత. ఈ బ్రిడ్జి ఇందిరాపార్కు-VSTల మధ్య వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 4 సిగ్నల్స్ దాటుకుని వెళ్లే ఉక్కు వంతెన కావడంతో 30 నిమిషాల ప్రయాణ సమయం కాస్తా 5నిమిషాలకు తగ్గనుంది. ప్రస్తుతం లోడ్ టెస్ట్ లో ఉన్న ఈ ఫ్లైఓవర్.. మరో 10 రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఎన్టీఆర్ స్టేడియం జంక్షన్, అశోక్‌నగర్ జంక్షన్, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ జంక్షన్, బాగ్ లింగంపల్లి జంక్షన్ - కనీసం నాలుగు జంక్షన్‌లను తప్పించి ఇందిరా పార్క్ నుండి విద్యానగర్ జంక్షన్ వరకు ఈ ఫ్లైఓవర్ సిగ్నల్ రహిత ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ జంక్షన్ వద్ద, ఫ్లైఓవర్ మెట్రో లైన్-II నుండి 26.54 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
ప్రత్యేకమైన 2.81 కి.మీ పొడవు ఉక్కు ఫ్లైఓవర్ 12,500 మెట్రిక్ టన్నుల ప్రత్యేక అల్లాయ్ స్టీల్, 20,000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ ఉపయోగించి నిర్మించబడింది. ఫ్లైఓవర్ 81 ఉక్కు స్తంభాలపై ఉంది. వీటిలో 46 పిల్లరు పునాదులు సహా స్టీల్‌వే కాగా, మిగిలినవి బహిరంగ త్రవ్వకాల పునాదులు. మొత్తంగా, 426 స్టీల్ గిర్డర్‌లు 16.6 మీటర్ల వెడల్పు గల నాలుగు లేన్‌ల డెక్ స్లాబ్‌కు సపోర్ట్‌ని ఇస్తాయి. ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర ఫ్లైఓవర్‌ను 26.54 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఇక్కడ మైట్రో రైలు వంతన మీదగా నిర్మించడం స్టీల్ బ్రిడ్జి ప్రత్యేకత. ఈ బ్రిడ్జికి 2020 జూలై 11వ తేదీన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదగా శంకుస్థాపన చేయగా సరిగ్గా మూడేళ్ల కాలంలో ఈ బ్రిడ్జి నిర్మాణం పూరైంది.
#Hyderabad: Steel flyover from Indira Park to VST will be open to public soon.
— NewsMeter (@NewsMeter_In) August 14, 2023
What is known of this Flyover ?
-2.81 Km long steel flyover is the first of its kind in the city of Hyderabad. Around 12,500 MT of special alloy steel and up to 20,000 Cum of concrete has gone into… pic.twitter.com/CmzBQLg7tw