Home > తెలంగాణ > హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న వీధి కుక్కలు..మరో చిన్నారిపై దాడి

హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న వీధి కుక్కలు..మరో చిన్నారిపై దాడి

హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న వీధి కుక్కలు..మరో చిన్నారిపై దాడి
X

హైదరాబాద్‌లో వీధి కుక్కలు రెచ్చిపోతూనే ఉన్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట జనాలపై దాడులు చేస్తున్నాయి.ప్రధానంగా చిన్నారులు కనబడితే చాలు వెంటాడి మరీ దాడి చేస్తున్నాయి. తాజాగా మరో చిన్నారిపై ఓ వీధికుక్క విచక్షణ రహితంగా దాడి చేసింది. సూరారం డివిజన్‌ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌ కాలనీలో బాలుడు సాయి చరిత్‌ (12)పై వీధి కుక్క దాడి చేసింది. ఆ చిన్నారి ప్రతిఘటిస్తున్నా...వదలకుండా మీద పడి కొరికేసింది. ఈ ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రగాయాలైన బాలుడిని నల్లకుంటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుక్క దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గత కొద్ది రోజులుగా వీధి కుక్కల దాడులు భారీగా పెరిగిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. కుక్కల దాడిలో పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన అధికారుల తీరులో మార్పు రావడం లేదు. వీధి కుక్కల నుంచి కాపాడాలని ప్రజలు మొత్తుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Updated : 4 Jun 2023 4:28 PM IST
Tags:    
Next Story
Share it
Top